Most Brilliant And Logical Interview Questions And Answers
1). భారతదేశంలో ఎన్ని సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సమాధానం : మూడు సార్లు.
జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 352 ప్రకారం ప్రకటిస్తారు. దేశం మొత్తానికి లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు అతి ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు ఈ విధంగా ప్రకటిస్తారు.
ఇటువంటి అత్యవసరపరిస్థితిని భారతదేశంలో మూడు సార్లు ప్రకటించారు.
అవి :
1962 చైనా యుద్ధం 1971 మరియు 1975 పాకిస్తాన్ యుద్ధం. ఇందిరాగాంధీ హయాంలో ప్రకటించారు.
2). భారతదేశ జాతీయ చిహ్నాన్ని ఎవరు ఆవిష్కరించారు?
సమాధానం : దినా నాథ్ భార్గవా
(Dina Nath Bhargava)
ఈయన 1927 నవంబర్ 1న మధ్యప్రదేశ్ లోని Betul జిల్లాకు చెందిన ముల్తానీ అనే చిన్న గ్రామంలో జన్మించారు.
ఈయన 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సాంస్కృతిక లలిత కళలలో మూడు సంవత్సరాల డిప్లొమా శాంతినికేతన్ లో పూర్తి చేశారు. అక్కడ ఈయన జాతీయ చిహ్నాన్ని నిర్మించే పనిలో పడ్డారు.
3). భారతీయ రాజ్యాంగాన్ని స్వహస్తాలతో లిఖించింది ఎవరు?
సమాధానం : ప్రేమ్ బిహారీ నరేన్ రాయ్జాద (Prem Behari Narain Raizada).
ఈయన 1901 డిసెంబర్ 17 న ఒక సాంప్రదాయ లిఖిత హస్తకళా వారి కుటుంబంలో జన్మించారు. ఈయన calligraphy ను తమ తాత గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు.
మన రాజ్యాంగంలో ప్రతి పేజీ చివరి భాగాన ఎడమవైపు - ప్రేమ్ అని రాసి ఉంటుంది. ఎందుకనగా రాజ్యాంగం రాసింది ఈయనే కావున.
4). జాతీయ జెండా లో ఉండే చక్రం 24 చువ్వలను కలిగి ఉంటుంది. ఎందుకు??
సమాధానం :
జాతీయ జెండా లో ఉండే చక్రము అశోక చక్రం. ఇది న్యాయానికి ప్రతీక. అశోక చక్రం అనేది ధర్మచక్ర అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. అశోక చక్రం 24 చువ్వలను కలిగి ఉంటుంది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోకుడి పరిపాలన లో ఈ చక్రం రూపొందించారు. ఈ అశోక చక్రాన్ని న్యాయానికి, ధర్మానికి గుర్తుగా గణతంత్ర భారత జాతీయ పతాకం మధ్యలో ఉంచారు.
ఈ చక్రం నీలం రంగులో, తెలుపు వర్ణం పై ఉంటుంది.
ఈ చక్రాన్ని 1947 జూలై 22న భారతీయ జాతీయ పతాకంలో పొందుపరిచారు. అంతకుముందు వరకు జాతీయ పతాకంలో అశోక్ చక్రానికి బదులు చేనేత మగ్గం ఉండేది.
అశోక చక్రం లో ఉండే 24 చువ్వలు భారతీయులు స్వతంత్ర పోరాటంలో చూపించిన 24 గుణగణాలకు ప్రతీకలు.
అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి :
1). ప్రేమ
2). ధైర్యం
3). సహనం
4). ప్రశాంతత
5). ఔదార్యం
6). మంచితనం
7). నిజము
8). మర్యాదను
9). నిస్వార్ధం
10). స్వయం నియంత్రణ
11). స్వీయ త్యాగం
12). యదార్ధం
13). ధర్మానికి
14). న్యాయం
15). జాలి
16). శృంగారము
17). వినయం
18). సానుభూతిగల
19). సానుభూతి
20). ఆధ్యాత్మిక జ్ఞానం
21) .నైతిక విలువలు
22). నిజమైన జ్ఞానం
23). దేవుని భయము
24). విశ్వాసం (లేదా) నమ్మకం (లేదా) ఆశ
.....
ఇందులోని సమాచారం మీకు ఉపయోగపడిందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీయొక్క విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి
ధన్యవాదాలు
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments