Most Brilliant And Logical Interview Questions And Answers

Most Intelligent IAS IPS UPSC Interview Questions With Answers
1). ప్రపంచంలో, ముఖ్యంగా మనదేశంలో అత్యంత గౌరవించదగిన ఉద్యోగం ఏది?

 సమాధానం : రైతు...!!!

 ఈ సమాధానం ఎవరు చెప్పరు. కాని నిజానికి రైతే లేకుంటే ఆకలితో బాధపడతాం . కానీ దాన్ని ఎవరూ గుర్తించరు. అందరికీ అన్నం పెట్టే రైతు కు మాత్రం మన దేశంలో గౌరవము లేదు. సుఖ సంతోషాలు లేవు...!!😢😢
 రైతు కష్టాన్ని గుర్తించి, రైతు.. అని సమాధానం చెప్పిన వారికి, రైతులను గౌరవించే వారికి మాయొక్క వందనాలు.
( ఎక్కువగా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలలో ఇది కూడా ఉంది)

2). భారతదేశం తొలిసారిగా బంగారు నాణేలను ఎవరు జారీ చేశారు?

 సమాధానం : ఇండో- గ్రీకులు .

3). ఆగ్రా నగరాన్ని నిర్మించింది ఎవరు?

సమాధానం : సికిందర్ లోడి.

4). తమిళనాడులోని సుప్రసిద్ధ చిదంబరం ఆలయంలోని దేవుడి పేరు ఏమిటి?

 సమాధానము: నటరాజు.

5). విజయనగర రాజ్యంలో ఇండో-ఇస్లామిక్ శైలిలో నిర్మించిన నిర్మాణం ఏది ?

సమాధానం : పద్మా మహల్.

6). రెండు ధ్వజస్తంభాలు గల ఏపీ రాష్ట్రంలోనే ఏకైక ఆలయం ఏది?

 సమాధానం : శ్రీకూర్మం. 

7). వాస్తు నిర్మాణంలో డబుల్ డోమ్ పద్ధతిని ప్రవేశపెట్టిన ముస్లిం పాలకులు ఎవరు?

 సమాధానం : లోడీలు.

8). ఆగ్రాలోని మోతీ మసీదును నిర్మించిన మొగలాయి రాజు ఎవరు?

 సమాధానము : షాజహాన్

9). ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజపుత్ర రాజు ఎవరు? 

సమాధానము : తోమర ఆనందపాలుడు.

10). ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన ఎక్కడ ఉంది ?

సమాధానం:  జమ్ము కాశ్మీర్ (ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది).

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క విలువైన సలహాలను మాకు అందజేయండి

ధన్యవాదాలు





Post a Comment

Please do not link any spam comments

Previous Post Next Post