సంపాదన మెరుగుపర్చుకునే కొన్ని ఆలోచనలు ప్రయత్నించండి మీ ఆదాయం పెంపొందించుకోండి.!!
ఒక్కసారి చేసిన పనికి పదేపదే ఆదాయం రావడం అనేది చాలా ముఖ్యం ..!!
మీరు ఏదైనా ఒక పని చేస్తే ఒక్కసారి మాత్రమే.. ఆదాయం వస్తుంది.
ఉదాహరణకి ఉద్యోగం లాంటిది, లేదా రోజువారీ కూలీ లాంటిది.
కానీ ఒకసారి చేసిన పనికి పదేపదే ఆదాయం వచ్చే విధంగా చూసుకోవాలి.
దీనినే మనం వ్యాపారం అంటాము.
వ్యాపారం అనగానే ఏదో పెద్దగా ఉంది, అని భయపడాల్సిన పనిలేదు. ఎటువంటి పెట్టుబడి లేదా పెద్దపెద్ద పెట్టుబడులు లేకుండా చేసే వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు మీరు ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
మేము ఇప్పుడు తెలపబోయే ఆదాయ మార్గాలలో ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము
మీరు వాటిని పాటించడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించి, మీ గమ్యాలను అదిరిపోయే రీతిలో అందుకుంటారు.
1). యూట్యూబ్..!!
యూట్యూబ్లో సొంతంగా మరియు ఉచితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టండి.
యూట్యూబ్ ఛానల్ ని పెట్టడంతో మీరు అందులో వచ్చే ప్రకటనల ఆధారంగా సంపాదించడం కాకుండా ఎంతోమంది కస్టమర్లను పొందగలరు .
అలాగే పేరు, ప్రఖ్యాత బిస్కెట్లు పొందుతారు. మీయొక్క అనుభవాలగురించి లేదా మీకు అనుభవం ఉన్న విషయం గురించి ఏదైనా నేర్పించడం వంటివి వీడియోస్ చేసి పెట్టండి. మీరు పెట్టే వీడియోస్ కి వచ్చే వ్యూస్ ఆధారంగా మీకు ఆదాయం రావడం జరుగుతుంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా రాబడికి పొందవచ్చు.
2). ఖరీదైన వస్తువులను కొని అద్దెకు ఇవ్వండి ..ఈ విధంగా రాబడి పొందవచ్చు!!
మంచి కంపెనీ కెమెరాలు, ఫోటో బూతులు, ట్రావెల్స్, ఏదైనా వెహికల్స్, ఫంక్షన్లకు ఉపయోగపడే సామాగ్రి ఇలాంటివి ఏవైనా ఇందులో పెట్టుబడి పెడితే మీకు ఎప్పుడు నష్టం ఉండదు. లాభం రాకపోయినప్పటికీ నష్టం అనేది కచ్చితంగా మీరు చూడరు.
వీటితో వ్యవహారం చేయడం చాలా భారంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆలోచిస్తే వీటితో కూడా అధిక రాబడి రాబట్టవచ్చు. అద్దెకు ఇచ్చిన వస్తువులతో వచ్చే సొమ్మును ఇతర ఖర్చులకు వాడుకోవచ్చు.
3). వినూత్న వస్తువులని తయారుచేసి అమ్మండి...!!!
మీరు చరిత్రలో విజయం పొందిన వారి కథలు చూసినట్లైతే తొలుత వారు సమస్యలు ఎదుర్కొన్నా వినూత్న వస్తువులు తయారు చేసి వాటిని అమ్మడంతో వారి విజయాన్ని అందుకున్నారు అందుకే ఒక వినూత్నమైన వస్తువు ఏదైనా కనిపెట్టండి. ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఆలోచనకు మీరు ప్రాణం పోయండి. అప్పుడు కొనుగోలుదారులు స్వయంగా మీ చెంతకు వస్తారు. మీ ఉత్పత్తులను కొని మిమ్మల్ని డబ్బులతో ముంచుతారు.
4). డివిడెండ్ స్టాక్ మార్కెట్లలో మీ సొమ్ము పెట్టండి
మీకు నిజమైన రిపీట్ ఇన్కమ్ కావాలనుకుంటే డివిడెండ్ స్టాక్స్ మార్గాన్ని ఎంచుకోండి. దీనికోసం మీరు సమగ్రమైన పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకుని స్టాక్మార్కెట్లలో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీకు మంచి లాభాలు వస్తాయి .
గమనిక : స్టాక్ మార్కెట్ల పై అవగాహన లేకపోతే మీ డబ్బు వృధా అవుతుంది . స్టాక్ మార్కెట్ రంగంలో అవగాహన లేనివారు వాటిజోలికి వెళ్లకపోవడం మంచిది.
5). మీయొక్క ఆస్తిని అద్దెకు ఇవ్వండి.
అద్దె రూపంలో వచ్చే డబ్బుతో అద్భుతమైన నెలసరి ఆదాయం వస్తుంది. మీ ఇంట్లోనే ఒక పోర్షన్ ను లేదా, రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ స్థిరాస్తులు పై మీరు ఇన్వెస్ట్ చేస్తే, తరువాత మీరు మంచి లాభాలు వస్తాయి.
6). బిజినెస్ సిస్టమ్ మరియు ప్రాంచైజీ క్రియేట్ చేయడం.
ఒకవేళ మీకు ఫ్రాంచైజీ కి సంబంధించిన బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే సొంత బిజినెస్ మొదలు పెట్టి దానికి పలు ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు తెరవండి. కెఎఫ్ సి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కొరియర్ సర్వీస్, కంప్యూటర్ ఆన్లైన్ సెంటర్ వంటివి మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి. దీంతో మీరు అధిక సంపాదన పొందవచ్చు.
7). బిజినెస్ సాఫ్ట్ వేర్ ను డిస్ట్రిబ్యూట్ చేయండి
మీరు ఏదైనా ఒక బిల్లింగ్, హాస్పిటల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన సాఫ్ట్ వేర్ లేదా అప్లికేషన్ ను ఒక్కసారి తయారు చేస్తే మీకు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం అధికాదాయం తీసుకొస్తుంది.
మీరు చేసే సాఫ్ట్ వేర్ లో మంచి ఫీచర్లు ఉంటే మార్కెట్లో ఎక్కువమంది మీ సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేస్తారు . ప్రతినెల మీకు రుసుము చెల్లిస్తారు. విజ్ఞాన విభాగంలో చదువుకున్నవారికి ఇది ఒక బంగారు అవకాశం.
8). లాభాపేక్షలేని సోర్స్ చేసి డొనేషన్ అడగండి.
సాఫ్ట్వేర్, ప్లగ్గిన్స్ వంటి కంటెంటును ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసి డొనేషన్ అడగండి. అధిక సంపాదన రావడానికి ఇదొక అదిరిపోయే దారిగా నిలుస్తుంది.
వర్డ్ ప్రెస్ డెవలపర్స్, plug-ins లాంటి మిగతావి బ్లాగర్లకు బాగా ఉపయోగపడతాయి. గనుక వారు ఇలాంటివి ఉచితంగా ఎక్కడ దొరుకుతాయి అని చూస్తుంటారు. మీరు వాటిని వారికి అందించి డొనేషన్ అడగవచ్చు. కంప్యూటర్పై ప్రోగ్రామింగ్ లాంగ్వేజి పై విజ్ఞానం ఉన్నవారు ఇలాంటివి చేయవచ్చు.
9). మొబైల్ యాప్ను క్రియేట్ చేయండి
మీకు ఏ యాప్ నచ్చితే ఆ యాప్ ను క్రియేట్ చేసి యాప్ స్టోర్ లో ఫ్రీగా పెట్టండి. మీ ఆప్ ను ఎంత ఎక్కువగా డౌన్లోడ్ చేస్తారో అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి. యాప్ను వాడుతున్నప్పుడు యాప్లో యాడ్స్ రూపంలో మీకు డబ్బులు పుష్కలంగా వస్తాయి.
10). కస్టమర్లను రిఫర్ చేయమని అడగడం
మీకు కస్టమర్లను ఎలా డీల్ చేయాలో తెలిస్తే మీరు వారి నుండి అధిక సంపాదన పొందగలరు. మీకు తెలిసిన కస్టమర్లు, బిజినెస్ ఓనర్ లను ఇతర కస్టమర్లను మీకు రిఫర్ చేయమని అడగండి. వారిని రిఫర్ చేస్తే మంచి బహుమతులు ఉంటాయని ప్రకటించండి. ఉదాహరణకి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించండి. కమీషన్ రూపంలో మంచి ఆదాయం వస్తుంది. మీ ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది.
11) మీయొక్క లేదా మీరు తీసిన ఫోటోలు వీడియోలను లైసెన్స్ చేయించుకోవడం ద్వారా డబ్బు సంపాదించండి.
ఫోటోలు, వీడియోలు ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకి షట్టర్ స్టాక్ వంటి కొన్ని మార్కెట్ ప్లేస్ లలో మీ ఫోటోలు, మీ వీడియోలు అప్లోడ్ చేయండి. వారి కండిషన్లకు మీరు ఒప్పుకుంటే మీ ఫోటోలను లేదా వీడియోలను వారి క్లైంట్లు, డౌన్లోడ్ చేసుకున్న ప్రతిసారి మీకు డబ్బు రివార్డు రూపంలో వస్తుంటుంది.
12) జిమ్ ను స్టార్ట్ చేయండి
ఇది కేవలం ఒకేసారి ఇన్వెస్ట్ చేసే అత్యుత్తమమైన బిజినెస్. జిమ్ కోసం ఒక మంచి ట్రైనర్ ను హైర్ చేసుకుంటే మీ జిమ్ లో ఉండే వస్తువులతో కొన్ని సంవత్సరాలపాటు మీరు సంపాదించవచ్చు. మీకు కొంత సొంత స్థలం ఉంటే జిమ్ము కంటే వేరే బెస్ట్ ఆప్షన్ ఏదీ లేదు. ఇటువంటి బిజినెస్ లకు ప్రభుత్వ బ్యాంకులు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.
13). టెంప్లేట్లు మరియు వెబ్ డిజైనింగ్ ద్వారా భారీగా సంపాదించండి
టెంప్లేట్లను వెబ్ డిజైనింగ్ పేజీలను అమ్మండి. వివిధ రకాల వెబ్ వీడియో టెంప్లేట్లను క్రియేట్ చేసి ఇవాంటో లాంటి భారీ మార్కెట్ ప్లేస్ లలో అమ్మండి. భారీ డిమాండ్ వున్న గ్రాఫిక్స్ టెంప్లేట్లు కోసం జనాలు ఇక్కడ వెతుకుతూ ఉంటారు. మీ టెంప్లేట్లను ఇతరుల కొనుగోలు చేసే ప్రతిసారి మీకు డబ్బు రావడం ఖాయం.
14). ఆన్లైన్లో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించండి
చాలా కంపెనీలు, ముఖ్యంగా ఆన్లైన్ కంపెనీలు అఫిలియేట్ మార్కెటింగ్ నమ్ముకుని బిజినెస్ చేస్తున్నాయి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు సైతం అఫిలియేట్ మార్కెట్ పై ఆధారపడి భారీగా ఆదాయం సంపాదించుకుంటున్నాయి. ఈ విధంగా వారికి వచ్చిన ఆదాయంలో కొంత శాతాన్ని అఫిలియేట్ గా పనిచేసిన వారికి అందిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఏదైనా అఫిలియేట్ లో చేరి మీయొక్క ఆదాయాన్ని పెంపొందించుకోండి. మీరు చేయవలసిందల్లా అమెజాన్ వంటి సంస్థలు మీకు ఇచ్చినటువంటి అఫిలియేట్ లింకును షేర్ చేయడం మాత్రమే. ఆ లింకు ద్వారా ఎంత మంది ఎన్ని వస్తువులు కొంటే అంత మొత్తంలో మీకు డబ్బు అందుతుంది.
15). ఏదైనా మంచి పుస్తకం రాయండి.
మనలో చాలామంది రచయితలూ ఉన్నారు. మీరు మీలో ఉన్న చైతన్యం బట్టి మంచి పుస్తకం రాసినట్లైతే అది అనేక రివార్డులు తీసుకువస్తుంది. అంతేకాకుండా దానిని మీరు ఆన్లైన్లో పబ్లిష్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీ పుస్తకాన్ని మీరు అమెజాన్ లాంటి ఆన్లైన్ సైట్ లో పెడితే మీకు ప్రతి నెల చెక్కు పంపడం జరుగుతుంది. మీ పుస్తకాలను మార్కెటింగ్ చేసేందుకు మీరు ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో అంత ఎక్కువ సంపాదన మీ సొంతం.
చివరగా ఒక చిన్నమాట
అదనంగా సంపాదించేందుకు మీకు లక్షల మార్గాలు ఉన్నాయి. అయితే మేము చెప్పిన ఆలోచనలు అదనంగా సంపాదన కొరకు మాత్రమే. అంతేకాని మీయొక్క ప్రధాన జీవనోపాధిని పక్కన బెట్టి ఇలాంటివి చెయ్యమని చెప్పడంలేదు. అయితే వీటిని తేలిగ్గా తీసుకోకండి. మొదట్లో కాస్త పెట్టుబడి మరియు కష్టం తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆ తర్వాత మీరు ఎలాంటి కష్టం చేయకుండానే ప్రతినెలా అదనంగా డబ్బులు తెచ్చి పెడతాయి.
ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ను మీ స్నేహితులతో షేర్ చేయండి.
ధన్యవాదాలు
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments