Most Important IAS IPS Question And Answers In Telugu
1). కప్పలు నీటిని త్రాగవు. మరి ఎలా జీవిస్తాయి ?
సమాధానం :
నిజమే..!! కప్పలు నీటిని త్రాగవు.కానీ నీటిని వాటి చర్మం నుండి లోపలికి గ్రహిస్తాయి. కాబట్టి కప్పలు నీటిని త్రాగకూండా జీవిస్తాయి.
2). మొసలి ఎన్ని సంవత్సరముల వరకు పెరుగుతుంది ?
సమాధానం :
మొసలి దాదాపు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎదుగుతూనే ఉంటుంది.
3). ప్రపంచంలో ఏ నగరం ప్రటి ఏటా కొంతమేర భూమి లోపలికి క్రుంగుతోంది ?
సమాధానము :
మెక్సికో నగరం ప్రతి ఏటా 18 నుంచి 24 అంగుళాలు క్రిందకు క్రుంగుతోంది.
4). అస్సలు స్వేదం (చెమట) పట్టని జంతువు ఏది ?
సమాధానము :
కుందేళ్ళకు అస్సలు చెమటపట్టదు.
5). ఒక రోజులో 5 నిమిషాలు మాత్రమే నిద్రపోయే జంతువులు ఏవి?
సమాధానం :
జింకలు రోజుకు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి.
6). చంద్రుడు పైన మొట్టమొదటిసారిగా కాలు పెట్టినప్పుడు "నీల్ ఆర్మ్ స్ట్రాంగ్" ఏ కాలు ముందు పెట్టాడు?
సమాధానం :
చంద్రుడు మీద దిగినప్పుడు "నీల్ ఆర్మ్ స్ట్రాంగ్" ముందుగా ఎడమ కాలు పెట్టాడు.
7). ఈఫిల్ టవర్ చివరకు చేరుకోడానికి ఎన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది?
సమాధానము :
ఈఫిల్ టవర్ చివరకు చేరుకోవడానికి 1,710 మెట్లు ఎక్కాలి.
8). పాలపుంతలోని నక్షత్రాలను సెకండ్ కి ఒకటి చెప్పునా లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది?
సమాధానం :
పాలపుంతలోని నక్షత్రాలను సెకండ్ కి ఒకటి చొప్పున లెక్క పెడితే మొత్తం లెక్కపెట్టడానికి దాదాపుగా మూడు వేల సంవత్సరాలు పడుతుంది.
9). తుఫాను గాలిలో విడుదలయ్యే శక్తి ఎన్ని బాంబులతో సమానం?
సమాధానము :
తుఫాను గాలి లో విడుదలయ్యే శక్తి సుమారు ఒక మెగా టన్ను బరువు కలిగిన బాంబుతో సమానం.
10). ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోనాలిసా చిత్రపటంలో లోపం ఏమిటి?
సమాధానం :
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోనాలిసా చిత్రపటంలో కనుబొమ్మలు ఉండవు.
11). ప్రపంచంలోని ఏ దేశంలో చూయింగ్ గమ్ నమలడం నేరం?
సమాధానం :
సింగపూర్ లో చూయింగ్ గమ్ తినడం నేరం
12). తల భాగం లేకుండా కనీసం వారం రోజులు జీవించగల కీటకజీవి ఏది?
సమాధానం :
బొద్దింక తన తల లేకుండా ఒక వారం రోజులు బ్రతక గలదు.
13). ప్రపంచంలోనే లోతైన సరస్సు ఏది?
సమాధానము :
రష్యాలోని బైకాల్ సరస్సు ప్రపంచంలోనే లోతైన సరస్సు.
14). చీమలు ఎంత సమయం విశ్రాంతి తీసుకుంటాయి?
సమాధానము :
చీమలు 12 గంటల వ్యవధిలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి.
15). ఒక రోల్స్ రాయిస్ కారు తయారుచేయడానికి ఎంత సమయం పడుతుంది?
సమాధానము :
ఒక రోల్స్ రాయిస్ కారు తయారు చేయడానికి ఆరు నెలల సమయం పడుతుంది.
16). ఏ నీరు తొందరగా ఐస్ గా మారుతుంది ? చల్లని నీరా లేదా వేడి నీరా?
సమాధానం :
చల్లని నీటితో పోల్చుకుంటే వేడి నీరు తొందరగా ఐస్ గా మారుతుంది.
17) అగ్గి పెట్టి ముందా, లేదా లైటర్ ముందా, దేనిని ముందు కనుగొన్నారు??
సమాధానము : అగ్గి పెట్టి కంటే ముందే "లైటర్" ను కనుగొన్నారు.
18). కంగారులు ఒకేసారి ఎంత దూరం గెంతగలవు ??
సమాధానము :
పెద్ద కంగారులు కనీసం 30 అడుగుల దూరాన్ని ఒకేసారి గెంతగలవు.
19). జాతీయ క్రీడా దినోత్సవం ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము?
సమాధానం :
ధ్యాన్ చంద్ (హాకీ క్రీడా కారుడు).
20). జీవితాంతం దంతాలు పెరుగుతూనే ఉండే జీవి ఏది ?
సమాధానం :
కుందేలు ముందు పళ్ళు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.
ఓ చిన్న జీవిత సత్యం :
వికసించే పుష్పం నేర్పింది,
తనలా అందంగా జీవించమని.
రాలి పోతున్న ఆకు నేర్పింది,
జీవితం శాశ్వతం కాదని.
ప్రవహించే వాగు నేర్పింది,
తనలా అవరోధాలు దాటి వెళ్ళమని.
మెరిసే మెరుపు నేర్పింది,
క్షణమైనా గొప్పగా ఉండమని.
ఇలాంటి మరికొన్ని అద్భుతమైన వింతలు, విశేషాల కోసం మా యొక్క తదుపరి వీడియో తప్పకుండా చూడండి
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL:
https://www.youtube.com/channel/UCrK1QTGs4jf_l3O2Z2LD7ZQ
https://www.youtube.com/channel/UCrK1QTGs4jf_l3O2Z2LD7ZQ
keep going boys
ReplyDeletePost a Comment
Please do not link any spam comments